- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం-బనకచర్లకు తెరచాటు సహకారం.. సీఎం రేవంత్‌పై కవిత సంచలన ట్వీట్
ఏపీ నిర్మిస్తున్న పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ‘X’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ ఆమె ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఏపీతో ములాఖత్ రాజకీయాలు..
గోదావరి నదిలో తెలంగాణ (Telangana)కు ఉన్న చట్టబద్ధమైన హక్కులను కాలరాసేలా ఏపీ ప్రభుత్వం పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరచాటున దానికి ఎంతగా సహకరిస్తోందో ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను చూస్తే స్పష్టమవుతోందని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్‌కు తెలంగాణ నీటి హక్కులపై కనీస సోయి లేదని విమర్శించారు. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కనీసం పటిష్టమైన పిటిషన్ కూడా వేయలేదంటే, ఏపీ సీఎంతో రేవంత్ రెడ్డి జరుపుతున్న ములాఖత్ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవచ్చని కవిత అన్నారు. ఈ లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి కనీసం నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించిందని, లోపాలతో కూడిన పిటిషన్ ఆధారంగా తాము ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వలేమని కోర్టు చెప్పడాన్ని ఎత్తిచూపారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ సీఎంకు గురుదక్షిణగా మన గోదావరి నీళ్లను రాసిస్తున్నారని ఈ బలహీనమైన పిటిషన్‌తో తేలిపోయిందని కవిత ఫైర్ అయ్యారు.
తెలంగాణ గడ్డ క్షమించదు..
ఏపీ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఇప్పటికైనా లోపాలు లేని అత్యంత పటిష్టమైన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అక్రమ ప్రాజెక్టును న్యాయపరంగా అడ్డుకోలేకపోతే.. తెలంగాణ గడ్డ, ఇక్కడి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నటికీ క్షమించరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కవిత వార్నింగ్ ఇచ్చారు.






