- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్యకర్త కరంచంద్ కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యెన్కెపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కరంచంద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

దిశ, మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యెన్కెపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కరంచంద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు ప్రకటించిన ఆర్థిక భరోసా నిధుల కింద మొత్తం ఆరు లక్షల రూపాయల విలువైన చెక్కులను మృతుడి ముగ్గురు పిల్లలకు ఆమె అందజేశారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. యెన్కెపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయిన కరంచంద్ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు మృతుడి ముగ్గురు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున రూ. 6 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కుమార్తె సాండ్రా లియోనా, కుమారులు మెల్విన్ లూయిస్, మార్టిన్ లూయిస్ పేరిట ఈ చెక్కులను స్వయంగా అందజేసి వారిని ఓదార్చారు.
కార్యకర్తల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత అని, కష్టకాలంలో ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ నాయకత్వం తోడుగా ఉంటుందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన ఇతర సహాయ సహకారాలను కూడా అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరంచంద్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, దేశమోళ్ల ఆంజనేయులు, మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, వీరితో పాటు సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రాజు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కరంచంద్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పార్టీ నాయకత్వం, పిల్లల విద్యా విషయాల్లోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.






