- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళగిరిలో చోరీ.. కేసు ఛేదించిన పోలీసులు
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైలాండ్ రోడ్డులో గత నెల 17న జరిగిన ఇంటి చోరీ కేసును మంగళగిరి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి చోరీకి గురైన 16 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..

దిశ, మంగళగిరి : మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైలాండ్ రోడ్డులో గత నెల 17న జరిగిన ఇంటి చోరీ కేసును మంగళగిరి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి చోరీకి గురైన 16 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ సిహెచ్ వెంకట్ అరెస్టు వివరాలను వెల్లడించారు.
ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లిన యజమానుల ఇంటిని ముందుగానే రెక్కీ చేసిన నిందితులు, తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువాలో ఉన్న ఒక బంగారు గొలుసు, ఐదు బంగారు ఉంగరాలు, నగదును అపహరించారు.
దర్యాప్తులో భాగంగా వెంపాల చంటి, క్రోసూరు శ్రీనివాసరావు అనే ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. వెంపాల చంటిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 100కు పైగా చోరీ కేసులు నమోదై ఉండగా, క్రోసూరు శ్రీనివాసరావుపై 28 కేసులు ఉన్నట్లు సీఐ వెంకట్ తెలిపారు .
అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి మొత్తం 16 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మంగళగిరి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.






