గద్వాల కాంగ్రెస్‌లో మరోసారి వర్గపోరు

by Ratna Kumari |

జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. దరూర్ మండలంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో వివాదం చోటుచేసుకుంది.

గద్వాల కాంగ్రెస్‌లో మరోసారి వర్గపోరు
X

దిశ, జోగులాంబ గద్వాల ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. దరూర్ మండలంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో వివాదం చోటుచేసుకుంది. కార్యక్రమంలో ఆవిష్కరించిన శిలాఫలకంపై తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (TGSGDC) చైర్‌పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సరిత తిరుపతయ్య పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తన పేరు శిలాఫలకంపై ఉండాల్సి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తొలగించారని సరిత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో తనను పదేపదే అవమానిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో గద్వాల కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమం అనంతరం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు సరిత తిరుపతయ్య నివాసానికి వెళ్లి ఆమెతో మాట్లాడినట్లు సమాచారం.

Next Story