బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య

by Batti.Sumithra |

చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో బైక్ కొనివ్వలేదనే మనస్తాపంతో 18 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య
X

దిశ, చేగుంట : చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో బైక్ కొనివ్వలేదనే మనస్తాపంతో 18 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పొలంపల్లి గ్రామానికి చెందిన మారబోయిన శ్రీకాంత్ (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. కొంతకాలంగా తనకు బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరుతున్నాడు. అయితే వడ్లు అమ్మిన తర్వాత బైక్ కొనిస్తానని తండ్రి రమేష్ చెబుతూ వస్తున్నాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తున్న సమయంలో కూడా శ్రీకాంత్ బైక్ కొనివ్వాలని పట్టుబట్టగా మరికొద్ది రోజులు ఆగాలని తండ్రి రమేష్ చెప్పాడు.

ఆదివారం ఉదయం నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్తున్న అని చెప్పిన శ్రీకాంత్ కొద్ది సేపు తర్వాత తన తల్లికి ఫోన్ చేసి బైక్ కొనివ్వడాన్ని పదేపదే వాయిదా వేస్తున్నారని అందరి ముందు తనకు అవమానంగా ఉందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా పొలంలోని చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందికి దించి నార్సింగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మృతి పై ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని మృతుడు తల్లి యశోద ఫిర్యాదు మేరకు నార్సింగి ఎస్ఐ సృజన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story