- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
సెల్ ఫోన్ కొనివ్వలేదని బీహార్ రాష్ట్రానికి చెందిన నితీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దిశ,చొప్పదండి: సెల్ ఫోన్ కొనివ్వలేదని బీహార్ రాష్ట్రానికి చెందిన నితీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం అరలియా జిల్లాకు చెందిన నితీష్ కుమార్‌కు మొత్తం ఐదుగురు అన్నదమ్ములు కాగా చిన్నవాడు నితీష్,పెద్ద అన్నయ్య కామారెడ్డిలో ఓ రైస్ మిల్ లో పనిచేస్తున్నారు. బీహార్ నుంచి ఒక వ్యక్తి కామారెడ్డిలో తన పెద్దన్నయ్య పని చేస్తున్న రైస్ మిల్ కు వస్తుండడంతో అతనితో పాటు 10రోజుల క్రితం నితీష్ వచ్చాడు.
నితీష్ తన అన్నయ్యను స్మార్ట్ ఫోన్ కావాలని కోరగా ప్రస్తుతం సెల్ ఫోన్ కొనుగోలుకు సరిపడా డబ్బులు లేవని, సర్దుబాటు అవ్వగానే కొనిస్తానని సర్ది చెప్పాడు. తిరిగి నితీష్‌ను బీహార్ పంపేందుకు చొప్పదండి హరిప్రియ రైస్ మిల్లు పనిచేస్తున్న నాలుగో అన్న వద్దకు ఈ నెల 13న పంపించాడు. మంగళవారం ఉదయం బీహార్ కు వెళ్లే వాళ్లతో కలిసి వాళ్ళ తమ్ముడిని పంపించే ఏర్పాటు చేశారు. అంతలోనే తన అన్నలు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన నితీష్ సోమవారం రాత్రి హమాలీ రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు.






