- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ అప్రమత్తతే మీ ఆస్తులకు రక్షణ కవచం’.. ఏసీపీ వసుంధర యాదవ్ కీలక సూచనలు
ఇటీవల కాలంలో గృహ చోరీలు, రాత్రివేళ దొంగతనాలు మరియు ఇతర ఆస్తి సంబంధిత నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కల్లూరు డివిజన్ ఏసీపీ, వసుంధర యాదవ్ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.

దిశ, ఏన్కూర్: ఇటీవల కాలంలో గృహ చోరీలు, రాత్రివేళ దొంగతనాలు మరియు ఇతర ఆస్తి సంబంధిత నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కల్లూరు డివిజన్ ఏసీపీ, వసుంధర యాదవ్ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. ప్రతి పౌరుడు తమ ఇల్లు, కుటుంబం మరియు విలువైన ఆస్తుల రక్షణ కోసం క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆమె అన్నారు.
భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మరియు రాత్రి నిద్రించే ముందు తలుపులు, కిటికీలు సక్రమంగా తాళం వేసి ఉన్నాయో నిర్ధారించుకోవాలి. ఇంట్లో అధిక మొత్తంలో నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులు నిల్వ ఉంచకుండా బ్యాంకు లాకర్లను వినియోగించాలి. ఇంటి పరిసరాల్లో తగిన వెలుతురు ఉండేలా చూడాలి. బలమైన తాళాలు, సెక్యూరిటీ డోర్లు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలి. ఇళ్లు, వ్యాపార సంస్థలు మరియు ఇతర ముఖ్య ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో పొరుగువారికి లేదా బంధువులకు సమాచారం ఇవ్వాలి. ఆస్తి నేరాల నివారణ మరియు గుర్తింపును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ క్రింది చర్యలను చేపడుతోంది.
రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్..
గ్రామాలు, కాలనీలు మరియు ప్రధాన రహదారులపై మొబైల్ పెట్రోలింగ్. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల పై ప్రత్యేక నిఘా సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ మరియు సాంకేతిక ఆధారాల సేకరణ. నేర ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుంది. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కార్యకలాపాల గురించి వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా డయల్-100 కు సమాచారం అందించగలరు. “మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్షణ కవచం అని ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు.






