- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: మీర్‌పేట్‌లోని ఓ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య
by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని మీర్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మీర్‌పేట్‌లోని హాస్టల్‌లో ఉంటున్న సరస్వతి అనే యువతి(21) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య(Young Woman Suicide) చేసుకుంది. తోటి విద్యార్థుల సమాచారంతో పోలీసులు హాస్టల్‌కు వచ్చి పరిశీలించారు. విద్యార్థినిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురంవాసిగా గుర్తించారు. కూతురు సరస్వతి మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్, కోచింగ్ సెంటర్ యాజమాన్యం ఆరోపణలు చేశారు. వీరితో పాటు అశ్వాపురానికి చెందిన నందకిషోర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






