- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలి
రాష్ట్రంలో తమలాంటి చదువుకున్న యువ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

దిశ, జడ్చర్ల : రాష్ట్రంలో తమలాంటి చదువుకున్న యువ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేట ప్రాంతంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్రానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం రెండేళ్లు పూర్తయిందని, వారి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి మరోసారి అవకాశం కల్పించాలని తాము కోరుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, ప్రస్తుత మంత్రుల పదవీకాలం కూడా రెండేళ్లు పూర్తయిందని పేర్కొంటూ, తమలాంటి చదువుకున్న యువ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని, అదే తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. అయితే మంత్రి పదవులు, ఇతర రాజకీయ నియామకాల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్ర పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని గౌరవించి అమలు చేస్తామని అనిరుద్ రెడ్డి తెలిపారు.






