అన్నం తింటూ యువకుడు మృతి

by Batti.Sumithra |   (  Updated:2026-06-23 11:46:07  IST  )

తిరుమలాయపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది.

అన్నం తింటూ యువకుడు మృతి
X

దిశ, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. అన్నం తింటున్న సమయంలో పెరాలసిస్ వచ్చి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొక్కిరేణి గ్రామానికి చెందిన జంగం రామకృష్ణ (37)అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. రామకృష్ణ ఎప్పటిలాగే సోమవారం ఖమ్మంలో ఆటో కిరాయి చేసుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లి భారతమ్మ అన్నం పెట్టగా రామకృష్ణ తింటున్న సమయంలో బీపీ పెరిగి పెరాలసిస్ వచ్చింది. చికిత్స కోసం రామకృష్ణను ఆటోలో తిరుమలాయపాలెంలోని సీహెచ్సీకి, అక్కడ నుంచి ఖమ్మం నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో రామకృష్ణ మృతి చెందాడు. రామకృష్ణ నోట్లో అన్నం ముద్ద పెట్టుకున్న సమయంలో పెరాలసిస్ రాగా, ఆ అన్నం ముద్ద నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడం ద్వారా ఊపిరాడక రామకృష్ణ మృతి చెందినట్లు తెలిపారు.

Next Story