- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ పొలం దున్నుతుండగా గుండెపోటుతో యువ రైతు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల పరిధిలోని చింతలకుంట గ్రామంలో వ్యవసాయ పొలం దున్నుతున్న సమయంలో గుండెపోటుతో ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, కేటీదొడ్డి : జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల పరిధిలోని చింతలకుంట గ్రామంలో వ్యవసాయ పొలం దున్నుతున్న సమయంలో గుండెపోటుతో ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలకుంట గ్రామానికి చెందిన మాల వీరేష్ (30) వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గురువారం తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ దున్నుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు స్పందించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు వీరేష్‌కు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న యువ రైతు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో చింతలకుంట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని, తగిన సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.






