- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రెండ్స్‌ను భయపెట్టబోయి.. కట్లపాము కాటుకు బలైన యువ వ్యాపారవేత్త!
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ హుస్సేనీ(30) పాము కాటుకు మృతి చెందారు.

దిశ, చేవెళ్ల:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 116లో ఉన్న ఫామ్‌హౌస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అత్తాపూర్ సర్కిల్ పరిధి ఖాద్రి హిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ హుస్సెనీ(30), స్నేహితులతో కలిసి ఫామ్‌హౌస్‌లో ఉండగా అక్కడికి వచ్చిన చిన్న విష సర్పాన్ని చేతితో పట్టుకుని వారిని భయపెట్టే క్రమంలో పాము ఆయన కుడిచేతి బొటనవేలిని కాటేసింది. అతను స్నేహితుల హెచ్చరికలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పాముకాటు వేసిన కొంతసేపటికి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ.. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది రెండు రోజుల క్రితం జరిగింది.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.






