- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాలినాలోని అసలైన బలాన్ని చూస్తారు: Sara Arjun
రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

దిశ, సినిమా: రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ధురంధర్ 2’(Dhurandhar-2) రానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా.. ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా అర్జున్(Sara Arjun) సీక్వెల్‌లో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పార్ట్-1 చూసిన వారి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, కానీ పార్ట్-2లో అంతకు మించిన యాక్షన్, అదిరిపోయే స్టోరీ ఉండబోతున్నాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తన పాత్ర గురించి సారా మాట్లాడుతూ.. మొదటి భాగంలో యాలినా కేవలం ప్రేమలో పడే అమ్మాయిగా కనిపిస్తే, రెండో భాగంలో ఆమెలోని అసలైన బలాన్ని ప్రేక్షకులు చూస్తారని చెప్పారు. తను కేవలం ఒక గ్లామర్ పాత్రగా కాకుండా, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపిస్తానని స్పష్టం చేశారు. ఒక ప్రకాశవంతమైన అమ్మాయి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించే మహిళగా ఆమె పాత్ర ప్రయాణం చాలా ఎమోషనల్‌గా ఉంటుందని సారా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ బిజీ అవుతున్న సారా, ధురంధర్ సీక్వెల్‌తో గ్లోబల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.






