- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో జీపీ ట్రాక్టర్ దొంగతనం.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!
పీకలదాకా మందు కొట్టి.. ఆ మత్తులో కొందరు యువకులు రోడ్డు వెంట ఉన్న పైపులైన్లు ధ్వంసం చేయడమే కాకుండా అదే మత్తులో జీపీ ట్రాక్టర్‌ను చోరీ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది

దిశ, భిక్కనూరు: పీకలదాకా మందు కొట్టి.. ఆ మత్తులో కొందరు యువకులు రోడ్డు వెంట ఉన్న పైపులైన్లు ధ్వంసం చేయడమే కాకుండా అదే మత్తులో జీపీ ట్రాక్టర్‌ను చోరీ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొందరు యువకులు మందు బాగా కొట్టి, తూగుతూ తుళ్ళుతూ నడుస్తూ.. గ్రామంలోని ఒక ఏరియా చెందిన గ్రామ పంచాయతీ వాటర్ లైన్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. అంతటితో ఊరుకోకుండా గ్రామపంచాయతీలో పార్క్ చేసి ఉంచిన ట్రాక్టర్ ను స్టార్ట్ చేసి ముందు ఉన్న ప్రహరీ గోడను ఢీకొడుతూ, ఆ యువకులు తాము నివాసం ఉండే ఇండ్ల వద్దకు తీసుకెళ్లి పెట్టారు.
ఆ తర్వాత ఇండ్లకు వెళ్లి నిద్రపోయారు. ఈ విషయం తెలియక కుటుంబ సభ్యులు గ్రామపంచాయతీ వాహనం ఇక్కడికి ఎలా వచ్చిందంటూ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి సమాచారం అందించగా అసలు బాగోతం బయటపడింది. తాగిన మత్తులో ఏం చేయాలో తెలియక, కొందరు యువకులు ఇదంతా చేశారని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. వెంటనే సదరు యువకుడిని పట్టుకొచ్చి అదే ట్రాక్టర్ ఇంజన్ కు కట్టేసి ఎడాపెడా వాయించారు. ఎందుకోసం చేశావు దీని వెనుక, ఎవరెవరున్నారు అంటూ గట్టిగా నిలదీయగా పలువురు పేర్లు చెప్పినట్లు సమాచారం. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలోని పోలీసులు గ్రామానికి వెళ్ళగా, పట్టుకున్న యువకులను పోలీసులకు అప్పగించారు.






