- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలకు హాజరు కావాలి
మర్కుక్ మండల కేంద్రంలో జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన, బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావుకు మర్కుక్ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, సర్పంచ్ బుల్లె రాణి మల్లేష్, ఉపసర్పంచ్ సాయిని మహేష్ ఆధ్వర్యంలో నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.

దిశ, ములుగు : మర్కుక్ మండల కేంద్రంలో జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన, బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావుకు మర్కుక్ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, సర్పంచ్ బుల్లె రాణి మల్లేష్, ఉపసర్పంచ్ సాయిని మహేష్ ఆధ్వర్యంలో నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని హరీష్ రావు హామీ ఇచ్చినట్లు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, బబ్బురి శ్రీనివాస్ గౌడ్, పాపోల రాజు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






