- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది రైతుల నిరసన.. దాడి కాదు: ఎంపీ కేశినేని చిన్ని
అమరావతి ఉండవల్లిలో వైసీపీ నేతల రాకతో స్థానికులు రైతులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనను దాడిగా వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఉండవల్లి(Undavalli)లో వైసీపీ(Ycp) నేతల రాకతో స్థానికులు రైతులు(Formers) నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనను దాడిగా వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. టీటీడీ నేతలు గుడివాడ(Gudivada), మాచర్ల(Macharla) వెళ్లినప్పుడు జరిగిందో అందరికీ తెలుసని.. అది అసలైన దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు నిరసన తెలిపితే దాన్ని దాడి అనడమంటే అంతకన్నా హాస్యాస్పదం మరోటిలేదన్నారు. అమరావతి ప్రజలపైనే వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నంత సేపు మూడు రాజధానులని, ఇప్పుడు ‘మావిగన్’(Mavigun) అంటూ వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వైసీపీ నేతలు అమరావతి వెళ్లి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. గతంలో టీటీడీ కార్యాలయంలో దాడి చేసిన వారే ఇప్పుడు అమరావతి ఉండవల్లి ఘటనలోనూ ఉన్నారని ఎంపీ చిన్ని ఆరోపించారు.
ధరలు పెరుగుతాయి..
గుణదల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే బోండా ఉమతో కలిసి శంకుస్థాపన చేశామని, స్థానిక ప్రజల ఆస్తుల రేట్లు కూడా పెరుగుతాయని ఎంపీ కేశినేని చిన్ని(Mp Kesineni Chinni) చెప్పారు. తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, తమ నేతలు ప్రజల్లో ఉంటున్నారని తెలిపారు. అమరావతిలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, దాన్ని తట్టుకోలేక ఇటువంటి టీడీపీ నేతలు తమపై దాడుల చేశారనే వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు.






