అన్ని సహాయ సహకాలు అందిస్తాం: రాధా గాయత్రి కుటుంబానికి హోంమంత్రి హామీ

by Vemula.Srinu Prasad |

అన్ని సహాయ సహకాలు అందిస్తామని రాధా గాయత్రి కుటుంబానికి హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు...రాధా గాయత్రి మృతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు...

అన్ని సహాయ సహకాలు అందిస్తాం: రాధా గాయత్రి కుటుంబానికి హోంమంత్రి హామీ
X

దిశ, వెబ్ డెస్క: ఉత్తరాఖండ్ ముస్సోరీ(Uttarakhand Mussoorie)లో విశాఖ(Visakha) టెకీ రాధా గాయత్రి(Radha Gayathri) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గాయత్రి మృతికి భర్త శ్రీచరణేనని చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోనే కాదు.. విశాఖలోనూ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను రాధా గాయత్రి తల్లిదండ్రులు కలిశారు. తమ కుమార్తె మృతికి సంబంధించి అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై తమకు అనుమానాలున్నాయని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో న్యాయం చేయాలని కోరారు.

అయితే కేసుకు సంబంధించిన వివరాలను ఉత్తరాఖండ్ ముస్పోరీ పోలీసులతో విశాఖ ఇంచార్జి జాయింట్ సీపీ మాట్లాడి తెలుసుకున్నామని రాధా గాయత్రి తల్లిదండ్రులకు హోంమంత్రి అనిత తెలిపారు. అటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఉత్తరాఖండ్ డీజీపీతోనూ మాట్లాడాలాని ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి సూచించారని తెలిపారు. అలాగే రాధా గాయత్రి కుటుంబ సభ్యులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.

Next Story