- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిని చంపిన తనయుడు.. ఆపై ఆత్మహత్య
by Batti.Sumithra |
నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని ఓ కొడుకు హతమార్చాడు.

X
దిశ, భూదాన్ పోచంపల్లి : నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని ఓ కొడుకు హతమార్చాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్ద రావులపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంఘం శ్రీనివాస్ మద్యానికి బానిసై రోజు తాగి వస్తుండడంతో తరచుగా గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్యతో గొడవపడి ఆదివారం చితకబాదాడు. భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సోమవారం తల్లి సంఘం పోచమ్మతో గొడవపడి హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






