- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజోలిని మింగేస్తున్న ఇసుక మాఫియా..!
రాజోలి మండల కేంద్రం పరిధిలో తుంగభద్ర నది నుంచి కొనసాగుతున్న విచ్చలవిడి అక్రమ ఇసుక రవాణాపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, రాజోలి: రాజోలి మండల కేంద్రం పరిధిలో తుంగభద్ర నది నుంచి కొనసాగుతున్న విచ్చలవిడి అక్రమ ఇసుక రవాణాపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక మాఫియా యథేచ్ఛగా దందా కొనసాగిస్తుండగా సంబంధిత శాఖలు చూస్తూ ఊరుకోవడం పట్ల మండిపడింది. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజోలి ఎమ్మార్వో, ఎస్సైలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బోర్లు, బావులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత శాఖల అధికారుల దృష్టికి...
గ్రామంలోని రహదారులు భారీ టిప్పర్లు, ట్రాక్టర్ల రాకపోకలతో పూర్తిగా దెబ్బతింటున్నాయని, రాత్రి వేళల్లో గ్రామం మధ్యగా వాహనాలు దూసుకెళ్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు వెంటనే ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని గౌరవ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇంకా అధికారులు స్పందించకపోతే రాజోలి గ్రామ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజోలి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






