- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియలు.. భారత్ తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హాజరుకానుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హాజరుకానుంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీట, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ ఈ కార్యక్రమం కోసం టెహ్రాన్ వెళ్లనున్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ, ఆయనకు బదులుగా ఈ ప్రతినిధి బృందాన్ని భారత్ పంపిస్తోంది. జూలై 4 నుండి 9 వరకు ఇరాన్‌లోని వివిధ నగరాల్లో ఈ అంత్యక్రియల కార్యక్రమాలు జరగనున్నాయి. జూలై 4 నుంచి 5 వరకు టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా కాంప్లెక్స్‌లో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహం ఉంచబడుతుంది. జూలై 6 వ తేదీన అధికారిక అంత్యక్రియల ఊరేగింపు జరగనుంది. కార్యక్రమాలు టెహ్రాన్‌లో ప్రారంభమై, ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లో అంతిమ సంస్కారాలతో ముగియనున్నాయి. ఈ అంత్యక్రియలకు లక్షలాది మంది ప్రజలు, పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.






