ప్రజాసేవకు ‘కాలం’ చెల్లిందా?

by Ratna Kumari |

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10-30 గంటలకే తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు తెరుచుకోవాలి.

ప్రజాసేవకు ‘కాలం’ చెల్లిందా?
X

దిశ, జహీరాబాద్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10-30 గంటలకే తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు తెరుచుకోవాలి. ఉద్యోగులు సీట్లలో ఉండాలి కానీ, మొగుడంపల్లిలో మండలంలోని తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయిల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. గడియారంలో ముళ్లు 10.30 దాటినా కార్యాలయానికి తాళాలు తీయకపోవడం, అధికారులు రాకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఈరోజు ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజావాణి’ (గ్రీవెన్స్ డే) ఉన్నప్పటికీ, ఉన్నతాధికారులు సైతం తీవ్ర ఆలస్యంగా హాజరుకావడం గమనార్హం.

సమయపాలన పాటించని అధికారులు..

ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు దాన్ని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 10.30 దాటిన తర్వాత నిమ్మళంగా వచ్చిన అధికారులు, ప్రజావాణికి ఆలస్యంగా హాజరయ్యారు.

ఉన్నతాధికారులు స్పందించాలి..

ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు.. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు ఉన్నా ఇలాంటి ఆలస్యాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ గారు స్పందించి, సమయపాలన పాటించని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story