- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీలో చేరలేదని కుల బహిష్కరణ?
తమ పార్టీలో చేరలేదనే కారణంతో కుల బహిష్కరణకు గురిచేశారని ఓ కుటుంబం ఆరోపిస్తున్న ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, కన్నెపల్లి : తమ పార్టీలో చేరలేదనే కారణంతో కుల బహిష్కరణకు గురిచేశారని ఓ కుటుంబం ఆరోపిస్తున్న ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. ఇటీవల జజ్జరవెల్లి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గుర్ల తానక్క 4వ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ పార్టీలో చేరాలని గ్రామంలోని కొందరు కుల పెద్దలు తమపై ఒత్తిడి తెస్తున్నారని గుర్ల తానక్క భర్త గుర్ల చంద్రశేఖర్ ఆరోపించారు. పార్టీ మారేందుకు నిరాకరించడంతో ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ఇటీవల గ్రామంలో జరిగిన శుభకార్యాలకు తమను ఆహ్వానించకుండా కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కన్నెపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వీడియో ద్వారా తమ గోడును వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలపై గ్రామ పెద్దలు లేదా సంబంధిత వర్గాల స్పందన తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






