- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నషా ముక్త్ భారత్‌లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: మంత్రి అడ్లూరి
నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి: నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జగిత్యాల లో నిర్వహించిన "నషా ముక్త్ భారత్" కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించి, నషా ముక్త్ భారత్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. ఒక్కసారి మాత్రమేననే నిర్లక్ష్యంతో డ్రగ్స్‌కు అలవాటు పడితే బయటపడటం కష్టమని హెచ్చరించారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలి..
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని, విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై నిఘా ఉంచి యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మత్తు పదార్థాలపై సమాచారం తెలిసిన వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, అధ్యాపకులు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.






