- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరిలాగే అతను.. వైభవ్ అరంగేట్రం చేయకపోవడంపై మౌనం వీడిన భారత కోచ్
ఐర్లాండ్ చేతిలో టీమిండియా వైట్‌వాష్ అయిన నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : ఐర్లాండ్ చేతిలో టీమిండియా వైట్‌వాష్ అయిన నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అరంగేట్రం చేయించకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెటే స్పందిస్తూ.. అందరిలాగే అతను కూడా అరంగేట్ర ప్రక్రియ ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నాడు.
‘అంతర్జాతీయ క్రికెట్‌కు అతను సిద్ధంగా ఉన్నాడు. అందులో సందేహం లేదు. కానీ, మూడు నెలల క్రితం వరల్డ్ కప్ గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. వైభవ్ ఆడితే చూడాలని మాకూ ఉత్సాహంగా ఉంది. అరంగేట్రం చేయడానికి ఇతర ఆటగాళ్లకు ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో అదే అతనికి కూడా వర్తిస్తుంది. అతను ఐపీఎల్‌లో బాగా ఆడాడు. ప్లేయర్లకు ఆత్మవిశ్వాసం కల్పించడం, జట్టులో సుదీర్ఘ కాలం ఇవ్వాలనుకుంటున్నామని సందేశం ఇవ్వడం ముఖ్యం.’అని ర్యాన్ టెన్ డిస్కెటే తెలిపాడు. అలాగే, ఐర్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోవడానికి తాను ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ‘మేము ఇటీవల వరల్డ్ కప్ గెలిచాం. ఐర్లాండ్ బేసిక్స్‌ను చక్కగా అమలు చేసింది. దానిని మేము ఎదుర్కోలేకపోయాం. బహుశా మేము దూకుడుగా ఆడటానికి అలవాటు పడ్డాం. స్వేచ్ఛగా సిక్స్‌లు కొట్టాం. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో తెలివిగా ఆడాల్సింది.’అని చెప్పుకొచ్చాడు.






