- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులతో దురుసు ప్రవర్తన నిందితుడికి మూడు రోజుల జైలు శిక్ష..
by Kodari Anjali |
మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌కు వచ్చి, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి గౌవర కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పించిందని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.

X
దిశ, మిడ్జిల్: మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌కు వచ్చి, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి గౌవర కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పించిందని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మిడ్జిల్ మండల పరిధిలోని కాటంగడ్డ తండాకు చెందిన లక్ష్మణ్ పవార్ (బిఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు) గత రెండు రోజుల క్రితం మద్యం మత్తులో మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందితో అనవసరంగా గొడవకు దిగి, అత్యంత దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. సంఘటనపై పోలీసులు డీ డీ కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి, నేరం రుజువుకావడంతో నిందితుడు లక్ష్మణ్ పవార్‌కు 3 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
Next Story






