- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కాంచన-4’లో స్వక్ష అయ్యర్
ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేక ప్రేక్షకాదారణ పొందిన ఫ్రాంచైజీస్‌లో ‘కాంచన’ ఒకటి.

దిశ, సినిమా: ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేక ప్రేక్షకాదారణ పొందిన ఫ్రాంచైజీస్‌లో ‘కాంచన’ ఒకటి. రాఘవ లారెన్స్ స్వియ డైరెక్షన్‌లో మొదట ‘ముని’గా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హారర్‌కు కామెడీని జోడిస్తూ ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు నవ్వించిన ఈ ఫ్రాంచైజీలో మునితో పాటు కాంచన సిరీస్‌లు దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా భారీ సక్సెస్‌ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌లో ‘కాంచన 4’ రాబోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ‘కాంచన 4’లో పూజా హెగ్డే అండ్ నోరా ఫతేహి భాగం అయినట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో యంగ్ బ్యూటీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు స్వక్ష అయ్యర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ విశేషంగా వైరల్ అవుతున్నది.






