- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతానికి సమన్వయంతో కార్యకర్తలు పని చేయాలి
మందమర్రి పట్టణంలోని బి-1 కార్యాలయంలో సోమవారం నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

దిశ, మందమర్రి : మందమర్రి పట్టణంలోని బి-1 కార్యాలయంలో సోమవారం నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడం, బూత్ లెవెల్ ఏజెంట్-2 (బీఎల్‌ఏ-2) వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం, ఓటరు జాబితాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, జిల్లా నాయకులు సొత్కు సుదర్శన్, ఆకారం రమేష్, బూత్ లెవెల్ ఏజెంట్లు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






