పొలంలో పిడుగుపాటుకు రైతు మృతి

by Batti.Sumithra |

ధర్పల్లి మండలం కార్నల్ తండాకు చెందిన ఓ రైతు పిడుగుపాటుకు ఆదివారం రాత్రి మృతి చెందాడు.

పొలంలో పిడుగుపాటుకు రైతు మృతి
X

దిశ, ధర్పల్లి : ధర్పల్లి మండలం కార్నల్ తండాకు చెందిన ఓ రైతు పిడుగుపాటుకు ఆదివారం రాత్రి మృతి చెందాడు. కార్నల్ తండా చెందిన ధరావత్ దేవి సింగ్ (55) అనే రైతు పొలం వద్ద ఉన్న తన గేదెను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మోటార్ సైకిల్ పొలం వద్దనే ఉంచి గేదెను తీసుకొని వచ్చి కట్టేసి తిరిగి పొలానికి వెళ్ళాడు. తన బైకు కోసం పొలానికి వెలుతుండగా, ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంలో ఒక్కసారి పిడుగు పడడంతో రైతు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పొలానికి వెళ్ళిన రైతు ఇంటికి రాకపోవడంతో తండావాసులు, కుటుంబ సభ్యులు ఆయన కోసం పొలంలో వెతుకుతుండగా ఆదివారం రాత్రి 9:30 గంటలకు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆ సమయంలో కొడుకు విహారయాత్రకు వెళ్లగా ఫోన్ ద్వారా సమాచారం అందించి ఇంటికి రప్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story