చేనేత సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్

by Kodari Anjali |

హుజురాబాద్ చేనేత సహకార సంఘాల బలోపేతానికి, కార్మికుల అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు.

చేనేత సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
X

దిశ, హుజురాబాద్ రూరల్: ​హుజురాబాద్ చేనేత సహకార సంఘాల బలోపేతానికి, కార్మికుల అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ మండలం ​రాంపూర్-రంగాపూర్ పరిధిలోని 'బాపూజీ చేనేత సహకార సంఘాన్ని' ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన సంఘం పాలకవర్గ సభ్యులను ప్రణవ్ శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి, సహకార సంఘాల పురోభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. నూతన పాలకవర్గం కార్మికుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సంఘం బాధ్యులు, ముషం వెంకట నారాయణ (అధ్యక్షుడు), జడల వెంకటేశ్వర్లు (ఉపాధ్యక్షుడు), ముషం రవి (కోశాధికారి),​పాలకవర్గ సభ్యులు, వెంకటేశ్వర్లు, ప్రభులింగం, సదానందం, శాంతయ్య, బండారి శోభా-సదానందం, పద్మ, కాంగ్రెస్ ​పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, జిల్లా అధికార ప్రతినిధి నేరేళ్ల మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబయ్య, యూత్ కాంగ్రెస్ నాయకుడు సజ్జు, ​గ్రామ శాఖల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, రామచంద్రం, నరసింహ రెడ్డి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Next Story