- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'విశ్వనాథ్ అండ్ సన్స్'పై క్రేజీ అప్డేట్... సాంగ్ పాడనున్న సూర్య
స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'.

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చాడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. ఈ సినిమా కోసం జి.వి. ప్రకాష్ కుమార్ ఓ అద్భుతమైన మాస్ బీట్‌తో కూడిన డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేయగా.. ఈ పాటను స్వయంగా హీరో సూర్య పాడినట్లు తెలిపాడు. ఈ పాటలో ఆయన స్టైలిష్ డ్యాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. స్వయంగా తానే పాడిన పాటకు తానే డ్యాన్స్ చేయబోతున్నాడనే వార్తతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. యంగ్ బ్యూటీ మమిత బైజు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్‌తో సందడి చేస్తున్నారు మేకర్స్.






