దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

by Kodari Anjali |

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి డిఆర్ఓ మాలతి తో కలిసి 95 దరఖాస్తులను విజయేందర్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ.. ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్‌లైన్‌లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టరు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story