- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘట్కేసర్ హైవేపై అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్.. యువతి కారును వెంబడిస్తూ వీరంగం!
హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ - బోడుప్పల్ హైవేపై అర్ధరాత్రి వేళ పోకిరీలు రెచ్చిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ - బోడుప్పల్ హైవేపై అర్ధరాత్రి వేళ పోకిరీలు రెచ్చిపోయారు. పెళ్లి ముగించుకుని కారులో తిరిగి వెళ్తున్న ఓ కుటుంబాన్ని బైక్‌పై వెంబడించి తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని గమనించి కూడా ఆకతాయిలు బరితెగించడం గమనార్హం. కారుకు అడ్డంగా బైక్‌ను పోనిస్తూ, అసభ్యంగా కేకలు వేస్తూ వారు చేసిన వీరంగం అంతా కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ అయింది. ఈ వేధింపుల వీడియోను బాధిత యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలు జరగడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో శాంతిభద్రతలు (లా అండ్ ఆర్డర్) క్షీణించాయని, అధికారుల నిఘా లేకపోవడం వల్లే పోకిరీలు ఇలా రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని విమర్శిస్తూ, సదరు ఆకతాయిలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






