PRP వెంటనే విడుదల చేయాలి.. సింగరేణి అధికారుల రిలే దీక్షలు ప్రారంభం

by Batti.Sumithra |

సింగరేణిలో అధికారులకు తక్షణమే కోల్ ఇండియాలో అమలు చేస్తున్న పే అబ్రివియేషన్ అమలు చేయాలని అఖిల భారత బొగ్గు గనుల ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలను ప్రారంభించారు.

PRP వెంటనే విడుదల చేయాలి.. సింగరేణి అధికారుల రిలే దీక్షలు ప్రారంభం
X

దిశ, మణుగూరు: సింగరేణిలో అధికారులకు తక్షణమే కోల్ ఇండియాలో అమలు చేస్తున్న పే అబ్రివియేషన్ అమలు చేయాలని, గత రెండు సంవత్సరాల ప్రొడక్షన్ రిలేటెడ్ పే (PRP) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అఖిల భారత బొగ్గు గనుల ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం వద్ద రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలు జూలై 13 వరకు కొనసాగుతాయని, యాజమాన్యం స్పందించకపోతే తీవ్రమైన పోరాటాలకు వెనుకాడమని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం ముఖ్య కార్యదర్శి మదన్ నాయక్, రమణారెడ్డి, రామ్ శంకర్, శోభన్ బాబు, సాయిల సురేష్ కుమార్, సర్వర్ నభి, కిషన్ రామ్, తోలం మధుసూదన్, డి. రమేష్ బాబు, సుదర్శన్ రెడ్డి, సీతారాం బాబు, జె. శ్రీనివాసరావు, నరసింహారావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Next Story