కాబోయే భర్త హత్య కేసు.. పెళ్లికి ముందే రూ.కోటి తీసుకున్న సియా!

by Naga Rani Yarlagadda |

పూణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది.

కాబోయే భర్త హత్య కేసు.. పెళ్లికి ముందే రూ.కోటి తీసుకున్న సియా!
X

దిశ, వెబ్‌డెస్క్: పూణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. కాబోయే భార్య సియా (20), ప్రియుడు చేతన్ చౌదరి (22) తమ భవిష్యత్ కోసం కేతన్ ను అంతమొందించిన ప్లాన్, ఎప్పటి నుంచే చేస్తున్న పనుల గురించి తెలిసి పోలీసులే అవాక్కవుతున్నారు. హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? సమాజం కళ్లు ఎలా కప్పాలి? అనే విషయాలపై ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు విచారణలో తేలింది.

మరో విషయం ఏంటంటే.. కేతన్ - సియా - చేతన్ ల మధ్య జరిగిన భారీ నగదు ట్రాన్స్ ఫర్ వెలుగుచూసింది. పెళ్లి ఖర్చుల నిమిత్తం కేతన్ అగర్వాల్.. కాబోయే భార్య అయిన సియా గోయల్ కు దాదాపు రూ.1 కోటి ఇచ్చాడు. అయితే ఆ డబ్బు అంతటినీ సియా పెళ్లి ఖర్చులకు వాడకుండా తన ప్రియుడైన చేతన్ కు బదిలీ చేసింది. ఇక చేతన్ ఆ డబ్బును తన కెరీర్, వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాలని ప్రణాళిక వేసుకున్నాడు. హత్య తర్వాత ప్రజల్లో, మీడియాలో ఈ కేసుపై ఇంట్రెస్ట్ తగ్గిపోయేందుకు, మూడేళ్లలో చేతన్ ఆర్థికంగా స్థిరపడేందుకు పెద్ద ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేతన్ హత్య తర్వాత సియా ఫ్యామిలీ అంగీకారంతోనే పెళ్లి చేసుకునేలా నిర్ణయించుకున్నారు. అందుకోసం హత్య తర్వాత మూడేళ్లపాటు ఒకరికొకరు దూరంగా ఉండాలని భావించారు. ఏదేమైనా ఓ వ్యక్తిని పెళ్లిపేరుతో నమ్మించి, మోసం చేసి.. ఏ పాపం తెలియని అతడిని ఘోరంగా చంపేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రియుడితో కలిసి అమాయకుడిని బలి తీసుకున్న సియాను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

Next Story