Vaishnavi Chaitanya: నా జీవితంలోని అద్భుతానివి నువ్వే లవ్ యు.. బేబీ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ‘బేబీ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Vaishnavi Chaitanya: నా జీవితంలోని అద్భుతానివి నువ్వే లవ్ యు.. బేబీ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ‘బేబీ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రజెంట్ ఈ అమ్మడు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) సరసన ‘జాక్’ మూవీ చేస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, వైష్ణవి చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా తన తమ్ముడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

‘‘మోస్ట్ అమేజింగ్ తమ్ముడు నితీష్‌కు(Nitish) హ్యాపీ బర్త్ డే. నా కోసం అన్ని చేస్తున్నందుకు థాంక్యూ. ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే. నన్ను మోటివేట్(Motivate) చేస్తున్నావ్. నీ ప్రేమ కేరింగ్‌తో రోజుని పరిపూర్ణం చేస్తావు. నా జీవితంలోని అద్భుతానివి నువ్వే. నువ్వు లేకుండా ఒక్కరోజుని కూడా ఊహించుకోలేకపోతున్నాను.

ఎవరు కేర్ తీసుకోనంత జాగ్రత్తగా నువ్వు నన్ను చూసుకుంటున్నావు. నువ్వే నా బలం. నీ కోసం నేనేదైనా చేస్తాను. మాటల్లో చెప్పలేను గానీ లవ్ యు(Love you)’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తమ్ముడితో దిగిన ఫొటోల(Photos)ను కూడా షేర్ చేసింది. ప్రజెంట్ వైష్ణవి పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా విషెస్ తెలుపుతున్నారు.

Next Story