ప్రధాని మోడీని కలిసిన యూపీ సీఎం.. రాష్ట్ర కేబినేట్ ఏర్పాటుపై చర్చ!

by Disha Web |
ప్రధాని మోడీని కలిసిన యూపీ సీఎం.. రాష్ట్ర కేబినేట్ ఏర్పాటుపై చర్చ!
X

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడంతో సీఎం యోగీ ప్రధాని మోడీని కలిశారు. ఆదివారం ఢిల్లీలో సీఎం యోగీ ప్రధానిని కలిసిన విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. 'యోగీ ఆదిత్యానాథ్ ఈ రోజు (ఆదివారం) సమావేశమయ్యారు. యూపీలో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపాను. గత ఐదేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి విశ్రాంతి లేకుండా ఆయన పనిచేశారు. రాబోయే రోజుల్లోనూ ఇదే కొనసాగిస్తారని నమ్ముతున్నాను. ఆయన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు' అని ట్వీట్ చేశారు. కాగా, యూపీలో నూతన ప్రభుత్వానికి మంత్రివర్గం ఏర్పాటు గురించి ఈ సమావేశం నిర్వహించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దాంతో పాటు ప్రమాణస్వీకారోత్సవం పైన చర్చించినట్లు వెల్లడించాయి. కాగా, రాష్ట్రంలో యోగీ తర్వాత నేతగా ఉన్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఓటమి కాస్తా బీజేపీని నిరాశకు గురిచేసింది. అప్నా దళ్ అభ్యర్థి పల్లవి పటేల్ చేతిలో 7వేల ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా తాజా ఎన్నికల్లో మరో 10 మంది మంత్రులు కూడా పరాజయం పొందారు.


Next Story

Most Viewed