ఎల్లమ్మగూడెం–మాడుగుల పల్లి డబుల్ రోడ్డు పనులు అస్తవ్యస్తం : వాటర్ ట్యాంకర్ బోల్తా

by Batti.Sumithra |

ఎల్లమ్మగూడెం–మాడుగులపల్లి మధ్య జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి.

ఎల్లమ్మగూడెం–మాడుగుల పల్లి డబుల్ రోడ్డు పనులు అస్తవ్యస్తం : వాటర్ ట్యాంకర్ బోల్తా
X

దిశ, మాడుగులపల్లి : ఎల్లమ్మగూడెం–మాడుగులపల్లి మధ్య జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. రోడ్డును పూర్తిగా తవ్వి మట్టి కుప్పలు వేసి వదిలేయడంతో రోడ్డు గుంతలు గుంతలుగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో బుధవారం రోడ్డు పనులకు నీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్యాంకర్ పూర్తిగా దెబ్బతినగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రతి రోజూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోడ్డుపై సరైన హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story