RRR ఎఫెక్ట్: కులం పిచ్చి కొడుకుల గొంతు కొయ్యాలి: PVP

by GSrikanth |
RRR ఎఫెక్ట్: కులం పిచ్చి కొడుకుల గొంతు కొయ్యాలి: PVP
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్(పీవీపీ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(మార్చి 25న) విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రంపై నెగెటివ్ రివ్యూ ఇచ్చిన మీడియా సంస్థలు, పలు వెబ్‌సైట్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుసగా పోస్టులు పెట్టి తన ఆవేశాన్ని బయటపెట్టారు.

''జీవితంలో ఒక షాట్ తియ్యలేదు. ఒక్కరోజు షూటింగ్లో నిలబడింది లేదు. కానీ, అందరికీ సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారు. సినీ ప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరూ, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి.'' అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక.. ''కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి. జాతి గర్వించే కథలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శెభాష్ అనాలి. మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి.'' అంటూ మరో ట్వీట్ చేశారు. చివరగా.. ''నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed