- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతలో వైసీపీ కీలక నేత దారుణ హత్య
అనంతపురంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. కళ్యాణదుర్గం-మనిరేవు సరిహద్దులో అధికార పార్టీకి చెందిన శ్రీధర్‌ను దుండగులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.

దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. కళ్యాణదుర్గం-మనిరేవు సరిహద్దులో అధికార పార్టీకి చెందిన శ్రీధర్‌ను దుండగులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. శ్రీధర్‌ను ఒకచోట హత్య చేసి కాల్వపల్లి సమీపంలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హతుడు శ్రీధర్ ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. కాగా, హతుడిది ఊర్వపల్లి మండలం షేషన్ పల్లి గ్రామం. గతంలో మనోహార్ నాయుడికి శ్రీధర్‌కు మధ్య వివాదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం నుంచి వస్తున్న తన కుమారుడిని మనోహర్ నాయుడే పక్కా ప్లాన్‌తో హత్య చేసి ఉంటాడని శ్రీధర్ తండ్రి లింగన్న ఆరోపించారు. కేసు నమోదు చేసిన కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.






