'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడికి Y కేటగిరి భద్రత..

by Disha Web Desk 19 |
ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి Y కేటగిరి భద్రత..
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో1990ల్లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'. మార్చి 11న ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదల తర్వాత అఖండ విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తోంది. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి.. లాంటి స్టార్ బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించారు. కాగా, ఇటివల కేంద్ర ప్రభుత్వం ఈ సినిమా దర్శకుడి భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా విడుదలైన దగ్గరనుండి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని కొన్ని వర్గాలు టార్గెట్ చేసినట్లు సమాచారం వచ్చిందని.. దీనితో కేంద్ర ప్రభుత్వం అతనికి Y కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా అతనికి సీఆర్ఫీఎఫ్ జవాన్లు కూడా భద్రత కల్పిస్తారని వెల్లడించింది.



Next Story

Most Viewed