- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా పని అయిపోయిందన్న జిన్ పింగ్.. అవునన్న ట్రంప్!
అమెరికా పతనం అంచున ఉందంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఓవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసీ ముగియగానే.. అమెరికా పతనం అంచున ఉందంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. అయితే చైనా అధ్యక్షుడి విమర్శలకు ట్రంప్.. అమెరికా ఒక క్షీణిస్తున్న దేశమని జిన్‌పింగ్ అన్న మాటలతో తాను వంద శాతం ఏకీభవిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ దుస్థితికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన తప్పుడు విధానాలే కారణమని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.
బైడెన్ హయాంలో అనుసరించిన బహిరంగ సరిహద్దు విధానాలు, భారమైన పన్నులు, దేశ ప్రయోజనాలను దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాల వల్లే అమెరికా ఈ స్థాయికి పడిపోయిందని ట్రంప్ ఆరోపించారు. 'నిద్రమత్తులో ఉండే బైడెన్' పరిపాలన వల్ల దేశం అపారంగా నష్టపోయిందని ఆయన మండిపడ్డారు. అదే సమయంలో, తన ఏడాదిన్నర పాలనలో దేశం అసాధారణమైన పురోగతిని సాధించిందని, పతనం నుంచి అమెరికాను మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తున్నానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.






