- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెజ్లర్ సుశీల్ కుమార్‌తో తిహార్ ఖైదీలకు రెజ్లింగ్‌పై శిక్షణ
న్యూఢిల్లీ : ఢిల్లీ సమీపంలోని తిహార్ జైలులోని ఖైదీలకు పలు క్రీడల్లో శిక్షణ..latest telugu news

న్యూఢిల్లీ : ఢిల్లీ సమీపంలోని తిహార్ జైలులోని ఖైదీలకు పలు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని ఢిల్లీ జైళ్ల శాఖ నిర్ణయించింది. ఆరు క్రీడల్లో ప్రొఫెషనల్స్ కోచ్‌తో కోచింగ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ తెలిపారు. ఇందులో భాగంగా రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్‌తో రెజ్లింగ్‌పై కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తామని చెప్పారు. యువ రెజ్లర్ హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులోనే ఉన్నాడు.
ఈ క్రమంలో సుశీల్ కుమార్‌తో తోటి ఖైదీలకు రెజ్లింగ్‌తోపాటు ఫిజికల్ ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇప్పిస్తామని జైలు అధికారులు వెల్లడించారు. 'సుశీల్ కుమార్ ఒక ప్రొఫెషనల్ రెజ్లర్. క్రీడలను నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారికి అతని శిక్షణ ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఖైదీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది' అని జైలు అధికారులు పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) సీఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఖైదీలకు ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, బాస్కెట్‌బాల్ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐవోసీఎల్ ఖైదీలకు శిక్షణ ఇచ్చేందుకు వారానికి రెండు రోజులు కోచ్‌లను పంపడంతో అవసరమైన క్రీడా సామగ్రిని అందజేయనుంది.






