- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ రవి దహియా మరో అద్భుతం చేశాడు. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన యాసర్ డోగు ర్యాంగింగ్ సిరీస్‌లో ఏకంగా పసిడి పతకాన్ని పట్టేశాడు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచులో 61 కేజీల విభాగంలో తలపడిన రవి దహియా ఉబ్జెకిస్తాన్ క్రీడాకారుడు గులోమ్ జోన్ అబ్దుల్లావ్‌ను 11-10 ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. టోర్నీ ఆరంభంలో 8-10 తేడాతో వెనుకబడిన దహియా చివరిదశలో పుంజుకున్నాడు. ప్రత్యర్థిని తన ఎత్తులతో చిత్తు చేసి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో రజతం సాధించిన రవి.. గతేడాది పోలాండ్‌లో జరిగిన పోటీల్లో అబ్దుల్లావ్ చేతిలో ఓడిపోయాడు. మొత్తానికి ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో అతన్ని ఓడించి రవి ప్రతీకారం తీర్చుకున్నాడు.
Next Story






