- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL- 2026 Final: అదరగొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ ఎదుట భారీ టార్గెట్
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ గుజరాత్‌లోని వడోదర మైదానం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ గుజరాత్‌లోని వడోదర మైదానం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు అద్భుతంగా రాణించింది. సమిష్టిగా రాణించి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో లిజెల్(37), షెఫాలీ వర్మ(20), లౌరా(38), రోడ్రిగ్స్(57), హెన్రీ(35) పరుగులతో అదరగొట్టారు. బెంగళూరు బౌలర్లలో సయాలీ, అరుధతి, క్లర్క్ తలో వికెట్ తీశారు. బెంగళూరు విజయం సాధించాలంటే 204 పరుగులు చేయాల్సి ఉంది.
బెంగళూరు జట్టు: గ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్), జార్జియా వోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.
ఢిల్లీ: లిజెల్ లీ (వికెట్ కీపర్), షఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మారిజాన్ కాప్, చినెల్లే హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ రానా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ.






