- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ చరిత్రలో పరమ చెత్త రికార్డు
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డు! పవర్ ప్లేలో కేవలం 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలిన వైనం.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎన్నో రికార్డులు నెలకొంటున్నాయి. ఒకసారి హైయస్ట్ స్కోరులు నమోదవుతుంటే మరోసారి హైయెస్ట్ రన్ చేజ్ లు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచులో పరమ చెత్త రికార్డు ఒకటి నమోదైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ, ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి పవర్ ప్లే ముగిసే సమయానికి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. గతంలో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 14 పరుగులతో ఉన్న రికార్డును ఢిల్లీ ఇప్పుడు 13 పరుగులతో అధిగమించింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇది ఐపీఎల్‌లో ఆ జట్టుకు మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది. గతంలో 2017లో ముంబైపై 66 పరుగులకు, పంజాబ్‌పై 67 పరుగులకు ఢిల్లీ ఆలౌట్ కావడం విశేషం. ఆర్‌సీబీ బౌలర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీ, ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ జట్టు కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు అయిన ఆర్సీబీ చెత్త రికార్డు నిన్న బ్రేక్ అవుతుందని అంతా భావించారు. కానీ మిల్లర్, అభిషేక్ పోరెల్ లు కొద్ది సేపు క్రీజులో నిలబడి.. ఆర్సీబీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు.






