- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరల్డ్ మోస్ట్ కాస్ట్లీ క్రిమినల్ హతం.. ఏకంగా రూ.130 కోట్ల రివార్డ్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అతిపెద్ద డ్రగ్ మాఫియా లీడర్ హతం అయ్యాడు. అతని పేరు మీద ఏకంగా రూ.130 కోట్ల రివార్డ్ ఉండటం గమనార్హం.

దిశ, వెబ్ డెస్క్ : మెక్సికోలో ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక డ్రగ్ కార్టెల్‌లలో ఒకటైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (Jalisco New Generation Cartel (CJNG)) కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ CJNG బాస్‌గా, అంతర్జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా పేరొందిన నెమెసియో రూబెన్ ఓసెగ్యూరా సెర్వాంటెస్.. సాధారణంగా "ఎల్ మెన్చో" (El Mencho)గా పిలవబడే వ్యక్తి, మెక్సికన్ ఆర్మీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో మరణించినట్లు అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సంఘటన జలిస్కో రాష్ట్రంలోని టపాల్పా ప్రాంతంలో జరిగింది. గువాడలజారా నగరానికి సుమారు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో మిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ ఆయనను పట్టుకోవడానికి భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ సమయంలో జరిగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో ఎల్ మెన్చో తీవ్రంగా గాయపడటంతో.. హెలికాప్టర్ ద్వారా మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు సమాచారం.
ఈ ఎన్‌కౌంటర్‌లో CJNG సభ్యులు కనీసం నాలుగు నుంచి ఏడు మంది వరకు హతమయ్యారని, ఆర్మీకి చెందిన ముగ్గురు సిబ్బంది గాయపడ్డారని రిపోర్టులు చెబుతున్నాయి. కాగా ఆపరేషన్ అనంతరం జలిస్కో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్యూర్టో వాలార్టా సహా పలు ప్రాంతాల్లో కార్టెల్ అనుచరులు రోడ్లు బ్లాక్ చేయడం, వాహనాలు తగలబెట్టడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ జలిస్కోలో ఉన్న అమెరికా పౌరులకు "షెల్టర్ ఇన్ ప్లేస్" అలర్ట్ జారీ చేసింది.
ఎల్ మెన్చోపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ 15 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.130 కోట్లకు సమానం. అదనంగా మెక్సికో ప్రభుత్వం కూడా 30 మిలియన్ పెసోస్ (సుమారు 1.6 మిలియన్ డాలర్లు) రివార్డ్ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక రివార్డ్‌లలో ఇది ఒకటిగా పరిగణించబడింది. మాజీ పోలీస్ అధికారి అయిన ఎల్ మెన్చో, 2009లో స్థాపించబడిన CJNG కార్టెల్‌ను అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ శక్తిగా తీర్చిదిద్దాడు. ఫెంటానిల్, మెథాంఫెటమైన్, కోకైన్ సరఫరాలో ఈ కార్టెల్ టాప్ ప్లేస్ లో ఉంది.






