- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచకప్ విజయం నీకే అంకితం.. థాంక్యూ మై డియర్ 'పొండాటి' అంటూ సంజూ శాంసన్ సందేశం
"నా గెలుపు వెనుక నువ్వు.." వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్ తన భార్యపై చూపిన అపురూపమైన ప్రేమ. నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు టీ20 ఛాంపియన్ గా నిలవడంలో సంజూ శాంసన్ (Sanju Samson) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో జట్టు ఉన్నప్పటికి ప్లేయింగ్ 1లో తగిన అవకాశాలు రాలేదు. కానీ రింకు సింగ్ తండ్రి మరణించడంతో అత్యవసరంగా వెళ్లడంతో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. కీలకమైన నాకౌట్, సెమీస్ మ్యాచులో అద్భుత ప్రదర్శన కనబరిచి.. ఫైనల్ జట్టులో సైతం చోటు దక్కించుకున్నాడు. అలాగే ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సైతం భారీ స్కోర్ చేసి సంజూ శాంసన్ కీలకంగా మారాడు.
దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులను సైతం దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచ కప్ 2026 చారిత్రాత్మక విజయం తర్వాత, టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ తన భార్య చారులత రమేష్‌కు అంకితం చేస్తూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ, తన విజయ ప్రస్థానం లో భార్య అందించిన మద్దతును గుర్తుచేసుకుంటూ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ మనసులో మాట
"నిన్ను కలిసిన మొదటి రోజు నుంచి ఈ క్షణం వరకు.. ప్రతి అడుగులో నాకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు. బయటి ప్రపంచం నన్ను ఎలా చూసినా, నాలోని మంచిని, చెడును సమానంగా స్వీకరించి నన్ను ప్రేమించావు. నా జీవితంలో క్రికెట్ అంటే ఎంత ప్రాణమో గుర్తించి, నా కలలను నీ కలలుగా మార్చుకున్నావు. ఈ అద్భుత క్షణం కోసం నేను ఎంతగా తపించానో, నువ్వు కూడా అంతే ఆరాటపడ్డావు. థాంక్యూ మై డియర్ పొండాటి (భార్య)" అంటూ సంజూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజూ, ఈ ట్రోఫీని తన భార్యకు అంకితం ఇచ్చారు. క్లిష్ట సమయాల్లో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన చారులతకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన ఈ పోస్ట్ క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంటుంది.






