- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీ హైదరాబాద్ లో వరల్డ్ బైస్కిల్ డే వేడుకలు
వాహన రహిత క్యాంపస్ లక్ష్యంగా ముందుకు సాగేలా ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్ చర్యలు తీసుకుంటుంది.

దిశ, సంగారెడ్డి : వాహన రహిత క్యాంపస్ లక్ష్యంగా ముందుకు సాగేలా ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆదివారం వరల్డ్ బైస్కిల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రీడల ఫ్యాకల్టీ ఇన్చార్జి హిమాన్షు జోషి ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కలిసి సైకిల్ తొక్కారు. ఈ వేడుకల్లో మాజీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు తమ సంపూర్ణ మద్దతును పలికారు. అయితే విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే జీవితంలోని అన్ని ఒడిదుడుకులు దాటి ముందుకు సాగే ఆస్కారం ఉంటుందని వెంకయ్యనాయుడు అన్నారు. కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలను అందజేసి వారిని ప్రోత్సహించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయేలా ఐఐటీ హైదరాబాద్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని డైరెక్టర్ మూర్తి స్పష్టం చేశారు.






