- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG20 లీగ్‌లో ఆదిలాబాద్ యువ క్రికెటర్..
ఆదిలాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ హిమతేజ కొడిమెల తెలంగాణ క్రికెట్ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ హిమతేజ కొడిమెల తెలంగాణ క్రికెట్ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన TG20 లీగ్ వేలంలో ఖమ్మం ACES జట్టు హిమతేజను రూ.8 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని క్రీడాభిమానులు, యువ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న హిమతేజ జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు టోర్నమెంట్లలో రాణించి తన ప్రతిభను చాటుకున్నాడు. అతని ఆటతీరు, ఆల్‌రౌండ్ ప్రతిభను గుర్తించిన ఖమ్మం ACES జట్టు వేలంలో మంచి ధరకు ఎంపిక చేసుకుంది. TG20 లీగ్‌లో అవకాశం రావడం తన క్రీడా జీవితంలో ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నట్లు హిమతేజ తెలిపాడు. హిమతేజ ఎంపికతో ఆదిలాబాద్ జిల్లా యువతలో క్రికెట్‌పై మరింత ఆసక్తి పెరుగుతుందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా నుంచి మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.






