మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన కార్మికులు

by Jakkula.Mamatha |

కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు అంబేద్కర్ సెంటర్ నుంచి రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన కార్మికులు
X

దిశ,హనుమకొండ కలెక్టరేట్: కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు అంబేద్కర్ సెంటర్ నుంచి రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నినాదాలతో హోరెత్తించిన కార్మికులు, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ ధర్నాకు దిగారు. కొండా సురేఖ ఇంటి ముట్టడి అనంతరం కొండా మురళికి వినతి పత్రం అందించారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కొండా మురళి కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగల రమేష్, నాయకులు బోట్ల చక్రపాణి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story